News December 2, 2025
ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 15, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి ఒంటి పూట బడులు

వేసవ తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.
News March 15, 2026
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

శ్రీకాకుళం జిల్లాలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విస్తృతంగా హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు హోటల్స్‌లో వినియోగిస్తే సీజ్ చేస్తున్నారు. దీంతోపాటు భారీగా ఫైన్ వేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ అక్రమ వినియోగం వల్ల గ్యాస్ కొరత సమస్యగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
News March 15, 2026
శ్రీకాకుళం: కాసులు కురిపిస్తున్న మొగలిరేకులు

శ్రీకాకుళంలోని ఉద్దానంలోని “మొగలి” డొంకలు సహజ రక్షణ కవచంలా తీరప్రాంతాన్ని కాపాడటంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు చక్కని ఆదాయం వనరుగా మారాయి. దట్టంగా పెరుగుతూ సహజ రక్షణ గోడగా నిలుస్తూ తీరప్రాంతాన్ని తుపాన్ల నుంచి కాపాడుతున్నాయి. మొగలిరేకులు నుంచి తయారుచేసే అత్తరుకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో సీజన్లో కొన్ని కుటుంబాలు ఈ అత్తరు తయారిని కుటీర పరిశ్రమగా నిర్వహించి, మంచి ఆదాయం సంపాదిస్తున్నాయి.


