News December 2, 2025
పిల్లల్ని కనండి.. ఎలాన్ మస్క్ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే మానవ జాతి క్షీణించి.. అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ <<18433631>>People by WTF<<>> పాడ్‌కాస్ట్‌లో మస్క్ కీలక విషయాలు పంచుకున్నారు. “నువ్వూ పిల్లలను కనాల్సిందే” అంటూ కామత్‌కు సూచించారు. మనిషి మనుగడ కోసం సంతానం కొనసాగించాలని స్పష్టం చేశారు.
Similar News
News March 25, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1122 పాయింట్లు లాభ పడి 75,190కు చేరగా నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 23,272 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సహా 12కుపైగా స్టాక్స్ 2%పైగా లాభాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, యుద్ధంపై శాంతి చర్చలకు ప్రయత్నాలు జరగడం ఇందుకు ప్రధాన కారణాలు.
News March 25, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,760 పెరిగి రూ.1,46,670కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,450 ఎగబాకి రూ.1,34,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.2,60,000గా ఉంది.
News March 25, 2026
‘ధురంధర్’.. రికార్డులన్నీ సరెండర్!

₹2,000Cr వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ మూవీ సిరీస్‌గా ‘ధురంధర్’ (పార్ట్1+2) రికార్డు సృష్టించింది. బాహుబలి, పుష్ప తర్వాత ఈ ఫీట్ సాధించిన 3rd ఇండియన్ సినిమాగా, సింగిల్ లాంగ్వేజ్‌లో పార్ట్-1, పార్ట్-2 రెండూ ₹500Cr+(నెట్) వచ్చిన తొలి సిరీస్‌గా నిలిచింది. ‘ధురంధర్-2’ ఇప్పటివరకు ₹919Cr(గ్రాస్) రాబట్టింది. ‘కాంతార: చాప్టర్-1’ను బీట్ చేసి Top10 హయ్యెస్ట్ గ్రాసింగ్ IND సినిమాల్లో 9వ స్థానానికి చేరింది.


