News December 2, 2025
సూర్యాపేట జిల్లా ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో ఎన్నికల కోడ్ నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పండుగలా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోందని, మొత్తం 486 గ్రామాలకు గాను, 170 సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
Similar News
News March 17, 2026
మచిలీపట్నం – విజయవాడ హైవేపై LED లైట్లు: కలెక్టర్

మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై లైట్లు (వీధి దీపాలు) సరిగ్గా వెలగకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం కృష్ణా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సోడియం వ్యాపర్ లైట్ల స్థానంలో LED లైట్లు లేదా సౌర శక్తితో వెలిగే లైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.
News March 17, 2026
GWL: నడిగడ్డ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

గద్వాల జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సీఎం కప్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను మంగళవారం అభినందించారు. జూడో లో 66 కేజీల విభాగంలో బంగారు పతకం, 46 కేజీ విభాగంలో రజత పథకం, జిల్లా మహిళా కబడ్డీ జట్టు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం, పురుషుల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.
News March 17, 2026
తిరుపతి ఐఐటీతో ఒప్పందం

తిరుపతి ఐఐటీ, మానేక్‌షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అండ్ రీసెర్చ్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశోధన, అభివృద్ధి, విద్య, శిక్షణ రంగాల్లో సహకారం పెంపొందుతుంది. సాయుధ దళాలు, జాతీయ భద్రతా సంస్థలకు నిపుణుల మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష రంగాల్లో పరిశోధనలకు మార్గం సుగమం అవుతుంది.


