News December 2, 2025
KMR: మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఎం

తాడ్వాయి మండలం దేమి గ్రామంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి నేడు పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడి, వారికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి మక్కల కొనుగోలు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

దేశవ్యాప్తంగా పానిక్ బుకింగ్స్ తగ్గాయని కేంద్రం తెలిపింది. అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని చెప్పింది. ‘గ్యాస్ బుకింగ్స్ 89 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గాయి. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల్లో 4 వేల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. కొత్తగా 13,700 PNG కనెక్షన్లు జారీ చేశాం. ప్రజలు PNG, ఎలక్ట్రిక్/ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మళ్లాలి’ అని సూచించింది.
News March 21, 2026
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్.. మార్చి 25 లాస్ట్ డేట్

మల్కాజ్గిరి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌కు సంబంధించి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలన్నారు.