News December 2, 2025

300 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఓరియెంటల్ <<>>ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ/PG, PG(ఇంగ్లిష్, హిందీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 10న ప్రిలిమ్స్, FEB 28న మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. బేసిక్ పే రూ.50,925 చెల్లిస్తారు.

Similar News

News April 2, 2026

సల్మాన్ – వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లోని మూవీపై ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. ఇందులో సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ పాజిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఓ పవర్‌ఫుల్ యాక్షన్ క్యామియోకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు టాక్. ఇక విలన్ పాత్రకు ఓ టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఇదే జరిగితే సినిమాపై అంచనాలు భారీగా పెరగనున్నాయి.

News April 2, 2026

రూపీ సూపర్ రికవరీ

image

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.

News April 2, 2026

స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం, డిప్యూటీ సీఎం బిజీబిజీ

image

TG: ఈనెల 9న పుదుచ్చేరి, కేరళం, అస్సాం రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా బిజీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేరళంలో పర్యటిస్తుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు, రేపు పుదుచ్చేరిలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఈనెల 4న కేరళంలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సైతం కేరళంలో ప్రచారంలో పాల్గొన్నారు. <<-se>>#Elections2026<<>>