News December 2, 2025
ఖమ్మం: మమ్మల్ని కాస్త ‘గుర్తు’ పెట్టుకోండి..!

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి పెరిగి ప్రచార జోరు సాగుతోంది. గ్రామాల్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గుర్తులు లేకున్నా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తులు వచ్చాక చెప్తాం కానీ.. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆశీర్వదించండి’ అంటూ అభ్యర్థిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
Similar News
News March 22, 2026
పార్వతీపురం: మహిళ అనుమానాస్పద మృతి

మహిళ మృతి చెందిన ఘటన మక్కువ(M) మేలపువలసలో చోటుచేసుకుంది. మేళాపు సింహాచలం(67) ఇంటికి ఈ నెల 21న పాలు పోయడానికి వెళ్లిన అరుణ ఆమెను ఎంత పిలిచినా పలకకపోవడంతో అప్పలనర్సమ్మకు తెలియజేసింది. వారు సింహాచలం ఇంటిలోపలకి వెళ్లి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది. మృతురాలి మెడపై ఎడమ వైపు కమిలిన గాయాలు, ముక్కునుంచి రక్తం కనిపించాయి. మెడలో ఉండే బంగారం కనిపించలేదు. దీనిపై పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
News March 22, 2026
వరంగల్ జిల్లాలో మాంసం ప్రియులకు షాక్!

వరంగల్ జిల్లాలో మాంసంప్రియులకు షాక్ తగిలింది. ఆదివారం చికెన్ ధరలు భారీ ధర పలికాయి. విత్ స్కిన్ కేజీ రూ.310-320 ఉండగా, స్కిన్‌లెస్ ధర రూ.340-350 వరకు పలుకుతోంది. లైవ్ కోడి కేజీ రూ.210-230 మధ్య విక్రయిస్తున్నారు. కాగా, నగరంతో పోలిస్తే పల్లెల్లో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, కోళ్ల సప్లై తక్కువ ఉండడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News March 22, 2026
జనసేన MLA బాలరాజుకు రూ.12లక్షలు టోకరా

AP: పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆర్టీఏ చలానా పేరుతో ఓ లింక్ పంపారు. దాన్ని క్లిక్ చేయగానే ఆయన ఖాతా నుంచి రూ.12లక్షలను మాయం చేశారు. మోసపోయినట్లు గుర్తించిన MLA వెంటనే జీలుగుమల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక SMలో షేర్ అయ్యే APK ఫైళ్లు, లింక్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇప్పటికే హెచ్చరించారు.


