News December 2, 2025
ఈసారి IPL వేలంలో పాల్గొనట్లేదు: మ్యాక్స్‌వెల్

IPL-2026 వేలంలో తాను పాల్గొనట్లేదని ఆస్ట్రేలియన్ క్రికెటర్ <<18444972>>మ్యాక్స్‌వెల్<<>> ప్రకటించారు. అనేక సీజన్ల తర్వాత ఈ ఏడాది వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ తనను క్రికెటర్‌గా, వ్యక్తిగా తీర్చిదిద్దిందని తెలిపారు. వరల్డ్ క్లాస్ టీమ్‌మేట్స్, ఫ్రాంచైజీలతో పనిచేయడం తన అదృష్టమని, ఏళ్లుగా మద్దతిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. త్వరలో కలుస్తానని పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి పొలంలో ఉన్న మురుగు నీటిని బయటకు పంపి మళ్లీ కొత్త నీటిని పెట్టాలి. అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడకూడదు. 10 కేజీల స్వర్ణపాల్ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 100 కేజీల వర్మికంపోస్ట్‌లో కలిపి ఎకరం పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటికి నీటిలో కరిగే స్థూల పోషకాలు (19.19.19) 10 గ్రాములను, 3 నుంచి 5 గ్రాముల సూక్ష్మపోషకాలను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News March 19, 2026
భీకర స్థాయికి యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం

ఇరాన్‌పై యుద్ధాన్ని భీకర స్థాయికి తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వేలాది US బలగాలను పశ్చిమాసియాకు తరలించే యోచన చేస్తున్నట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు రక్షణ కల్పించడంతోపాటు ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపానికీ వారిని పంపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ చాలా ప్రమాదకరమని ఓ అధికారి చెప్పినట్లు వివరించింది.
News March 19, 2026
ఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లేదా?

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఇందులో చేదుకు ప్రతీకగా నిలిచే వేప పువ్వు దొరకడం లేదు. చెట్లను నరికేయడం, తెగుళ్లతో చనిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో వేప పువ్వు దొరుకుతున్నా పట్టణాలు, సిటీల్లో కరవు నెలకొంది. HYDలో కొన్నిచోట్ల చిన్న రెమ్మకే ₹25-30 తీసుకుంటున్నారు. వేప పువ్వుకు ప్రత్యామ్నాయాన్ని పూర్వీకులు సూచించలేదని, అయితే దాని స్థానంలో తులసిని వాడుకోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.


