News December 2, 2025
భూపాలపల్లి: 3న దివ్యాంగుల దినోత్సవం

జిల్లాలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమావేశం హాల్‌లో ఈ వేడుక జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లిశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరారు.
Similar News
News March 11, 2026
చిత్తూరు: రూ.289 కోట్లతో బడ్జెట్ అంచనా

చిత్తూరు నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.289.07 కోట్లతో బడ్జెట్ రూపొందించింది. మంగళవారం మేయర్ అముద అధ్యక్షతన జరిగిన నగరపాలక కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం లభించింది. మొత్తం జమలు రూ.296 కోట్లుగా అంచనా వేయగా, వ్యయం రూ.270.78 కోట్లుగా నిర్ణయించారు. అభివృద్ధి పనులకు రూ.25.57 కోట్లు కేటాయించారు.
News March 11, 2026
భారత్‌కు తొలి టెస్ట్ విజయం అందించింది ఈయనే

భారత్‌కు తొలి టెస్ట్ విజయాన్ని(1952లో ENGపై) అందించిన కెప్టెన్ విజయ్ హజారే జన్మదినం నేడు. 1915లో సాంగ్లీ(MH)లో జన్మించారు. IND తరఫున 30 టెస్టుల్లో 2192 రన్స్, 20W తీశారు. 14 టెస్టులకు కెప్టెన్సీ చేశారు. FCలో 238 మ్యాచుల్లో 18,740R, 595W సాధించారు. FCలో 2 ట్రిపుల్ సెంచరీలు, ఒకే టెస్టులో 2 సెంచరీలు చేసిన తొలి IND ప్లేయర్ ఆయనే. కేంద్రం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన పేరిట టోర్నీ నిర్వహిస్తోంది.
News March 11, 2026
MDK: నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ హత్య..?

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) సోమవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెలిమకుంట వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముఖంపై కర్రతో దాడి చేసిన గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.


