News December 2, 2025

భూపాలపల్లి: కాంగ్రెస్ సారథికి సవాల్!

image

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌కు పంచాయతీ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత లుకలుకల నేపథ్యంలో, అన్ని వర్గాలను కలుపుకుపోవడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. సీనియర్ నాయకులతో సమన్వయం సాధించడంపైనే ఆయన దృష్టి సారించాల్సి ఉంటుంది.

Similar News

News March 19, 2026

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటిస్తారా..!

image

త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఓ లంబాడా నేతకు బెర్తు దక్కే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. జిల్లా నుంచి ఆ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ ఉన్నారు. ఇక మరో నేత రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం కళ్లలో వత్తులేసుకుని చూస్తున్నారు. త్వరలోనే మంత్రిని అవుతానంటూ ఆయన చౌటుప్పల్‌తో పాటు పలు చోట్ల కామెంట్స్ చేశారు. మరి అమాత్య యోగం ఎవరికి దక్కుతుందో అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

News March 19, 2026

ఒంగోలు: విధుల్లో గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్

image

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పనిచేస్తున్న ఎక్సైజ్ కార్యాలయ కానిస్టేబుల్ కందుల రాఘవరావు విధుల్లో ఉండగా మృతి చెందారు. సెంట్రీ డ్యూటీలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు కాగా మృతదేహాన్ని అక్కడికి తరలించారు. ఐదు నెలల క్రితం ఈయన ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు. ఆఫీసులోనే చనిపోవడంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

News March 19, 2026

తొలి విడతలోనే అందరికీ రైతు భరోసా?

image

రైతు భరోసా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విస్తీర్ణం ప్రాతిపదికన విడతల వారీగా కాకుండా ఈ నెల 22న ఒకే రోజు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చూస్తోంది. రైతుకు ఎంత భూమి ఉన్నా తొలి విడతలో మొదటి ఎకరాకు ₹6,000 నగదును అకౌంట్లలో జమ చేస్తారని సమాచారం. మిగిలిన భూమికి 2, 3 విడతల్లో సాయం అందనుంది. ఎకరం లోపు ఉన్న వారికి ఎలాగూ తొలిరోజే పడుతుంది.