News December 2, 2025
చైనా మాంజాలపై నిర్మల్ పోలీసుల పంజా

జిల్లాలో చైనా మాంజా విక్రయాన్ని నిరోధించేందుకు జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పతంగులు ఎగరేసే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజ వినియోగం, రవాణా, నిల్వ విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కిరాణా దుకాణాలు, చిన్నపాటి వ్యాపార కేంద్రాలను సందర్శించి చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News March 13, 2026
NTR: హైకోర్టు లాయర్‌పై దాడి కేసులో కీలక మలుపు

విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాదిపై 2023లో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-1 నిందితుడు కర్నాటి వీరభద్రరావును పటమట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News March 13, 2026
వారసత్వ స్థలాలకు సెల్ఫ్ డిక్లరేషన్ చాలు!

AP: వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై గ్రామాల్లోని ఇలాంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు. యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. తమకు పూర్వీకుల నుంచే ఆస్తి వచ్చిందని, నిషేధిత జాబితా(22A)లో లేదని, తామే పూర్తి హక్కుదారు అని అందులో స్పష్టంగా పేర్కొనాలి. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు.
News March 13, 2026
నిజామాబాద్: ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

ఇందల్వాయి మండలం గన్నారం 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో అకోలా (మహారాష్ట్ర) వెళుత్తున్న బస్సు ఇందల్వాయి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందల్వాయి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


