News December 2, 2025

నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

image

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.

Similar News

News March 22, 2026

సైదాపురం మైకా గనులపై MP కన్ను: YCP

image

సైదాపురంలోని మైకా గనులను ఇష్టానుసారం తవ్వుకునేందుకు కూటమి పెద్దలు పథకం సిద్ధం చేశారని YCP ఆరోపించింది. ‘ఇప్పటికే లీజు ముగిసిపోయిన గనుల్లో ఇంకా తవ్వకాలు జరుపుతూ రూ.వందల కోట్ల పెనాల్టీకి గురైన సంస్థలను ప్రభుత్వం వెనకేసుకు వస్తోంది. ఆ పెనాల్టీ చెల్లించనక్కర లేకుండానే వారికి లీజును కొనసాగించడానికి ఫైల్ సిద్ధం చేస్తోంది. దీని వెనక TDP ముఖ్య నేతతో పాటు MP ఉన్నట్లుగా తెలిసింది’ అంటూ ‘X’లో రాసుకొచ్చింది.

News March 22, 2026

నెల్లూరులో దారుణ హత్య.. మృతుడి వివరాలు ఇవే!

image

నెల్లూరు బోడిగాడి తోటలోని శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి<<19446783>> దారుణ హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. నవాబ్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వీర్ క్రాంత్ అని, వలస కూలీ అని చెబుతున్నారు. మృతదేహం పక్కనే ఉన్న సిమ్ కార్డ్ ఆధారంగా వివరాలు తెలిసినట్టు సమాచారం.

News March 22, 2026

నెల్లూరు నగరంలో దారుణ హత్య!

image

నెల్లూరు నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య జరిగినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని ఈ హత్య చేసి కాల్చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.