News December 2, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె X వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.
Similar News
News March 22, 2026
జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

ఏలూరు జడ్పీ సర్వసభ్య సమావేశంలో జేసీ అభిషేక్ గౌడ్ పాల్గొని జిల్లాలో వంటగ్యాస్ సరఫరాపై కీలక ప్రకటన చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని, పైప్‌లైన్ ద్వారా సరఫరాను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 5 వేల కనెక్షన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, వాణిజ్య విభాగాలకు కూడా అంతరాయం లేకుండా గ్యాస్ అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.
News March 22, 2026
ఇదేందయ్యా ఇది.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు..

AP: అనంతపురం పోలీసులకు వింత ఫిర్యాదు అందింది. తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది సందర్భంగా మటన్, తలకాయ కొనుగోలు చేశాడు. కుక్కర్‌లో సుమారు 20 సార్లు ఉడికించినా ఆ మాంసం ఉడకలేదని విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వండిన పాత్రతో సహా వెళ్లడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతనికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు.
News March 22, 2026
NGKL: రైతులు ALERT.. ఈనెల 24న ‘కిసాన్ మేళా’

నాగర్ కర్నూల్ జిల్లా పాలెంలోని కృషి విజ్ఞానకేంద్రంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ Dr.పి.శ్రీదేవి “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఈనెల 24న ఉదయం 9:30 గంటలకు వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై నమూనాల ప్రదర్శన, రైతులు-శాస్త్రవేత్తలకు చర్చా,
ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తామని రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
SHARE IT


