News December 2, 2025

NZB: వాహనదారులకు గమనిక

image

నవీపేట్-నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నందున నవీపేట్ ప్రధాన రైల్వే గేటు రెండురోజుల పాటు మూసి వేయనున్నారు. రేపు ఉ.6 గంటల నుంచి గురువారం సా.6గంటల వరకు మూసివేయనున్నారు. కావున నిజామాబాద్ నుంచి బాసర, భైంసా, ధర్మాబాద్ వైపు వెళ్ళే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని, అలాగే బాసర నుంచి జానకంపేట, బోధన్ వైపు వెళ్లే వారు ఫకీరాబాద్-సాటాపూర్ గేట్ వైపు వెళ్లాలని సూచించారు.

Similar News

News March 8, 2026

బంగ్లాలో ‘Gen Z’ పార్టీ ఎందుకు ఓడింది?(1/2)

image

బంగ్లాదేశ్‌లో హసీనా, నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వాలు కూలిపోవడానికి Gen Z నిరసనలే కారణం. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా యువత పోరాటం చేసింది. అయితే బంగ్లాలో స్టూడెంట్స్ నహిద్, హస్నాత్, అఖ్తర్ ఏర్పాటుచేసిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. హింసను నమ్ముకోవడం, ప్రజలకు భరోసా కల్పించలేకపోవడం, రాజకీయ అనుభవలేమి, వివాదాలు ప్రధాన కారణం. అటు నేపాల్‌లో Gen Z ఎన్నికల్లో సత్తా చాటింది.

News March 8, 2026

నేపాల్‌లో ‘Gen Z’ ఎలా గెలిచింది?(2/2)

image

నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వం SMపై నిషేధం విధించడంతో Gen Z తిరుగుబాటు చేసింది. ఈ ఉద్యమంలో బాలెన్ షా కీలక పాత్ర పోషించారు. ర్యాపర్‌గా రాజకీయ అవినీతి, ప్రజాసమస్యలను పాటల రూపంలో వివరించారు. నిరసనల సమయంలోనే PM ఆఫర్ వచ్చినా ఆయన తిరస్కరించి కాఠ్‌మాండూ మేయర్‌గా గెలిచారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP)లో చేరి ప్రజల ఇబ్బందులపై దృష్టిసారించారు. యువతను సరైన దారిలో నడిపిస్తూ గెలుపు బావుటా ఎగురవేశారు.

News March 8, 2026

ట్రంప్‌ను వదిలేది లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

image

అయతుల్లా ఖమేనీ మృతికి ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరించారు. తమ నాయకుడు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని Xలో స్పష్టం చేశారు. ‘ఇరాన్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాలను US ఉపయోగించుకోకుండా మిడిల్ ఈస్ట్ దేశాలు నిరోధించాలి. ఆ ప్రాంతాల నుంచి దాడి జరిగితే మేం ప్రతిస్పందిస్తాం’ అని తేల్చిచెప్పారు. IRGC కొందరు అమెరికన్ సైనికులను బంధించిందని పేర్కొన్నారు.