News December 2, 2025
NZB: వాహనదారులకు గమనిక

నవీపేట్-నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నందున నవీపేట్ ప్రధాన రైల్వే గేటు రెండురోజుల పాటు మూసి వేయనున్నారు. రేపు ఉ.6 గంటల నుంచి గురువారం సా.6గంటల వరకు మూసివేయనున్నారు. కావున నిజామాబాద్ నుంచి బాసర, భైంసా, ధర్మాబాద్ వైపు వెళ్ళే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని, అలాగే బాసర నుంచి జానకంపేట, బోధన్ వైపు వెళ్లే వారు ఫకీరాబాద్-సాటాపూర్ గేట్ వైపు వెళ్లాలని సూచించారు.
Similar News
News April 1, 2026
కొండగట్టు ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందన

కొండగట్టులో చిన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిరి కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు నాయీబ్రాహ్మణులు గాయపడగా, ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఉచిత చికిత్స అందించాలని, ప్రతి బాధితుడికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని అన్నారు.
News April 1, 2026
అల్లూరి: 95 శాతం ఇంటి పన్నులు వసూలు

అల్లూరి, పోలవరం జిల్లాల్లో 95 శాతం గ్రామాల్లో ఇంటి పన్నులు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు బుధవారం తెలిపారు. రెండు జిల్లాల్లో మొత్తం 430 పంచాయతీలు ఉండగా 412 పంచాయతీల్లో రూ.12 కోట్లు పన్నులు వసూలు చేశామన్నారు. మిగిలిన గ్రామాల్లో 2 రోజుల్లో వసూళ్లు పూర్తి చేసి జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
News April 1, 2026
సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని మెరుగుపరచాలి: కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాలకు, అధికారులకు ర్యాంకింగ్‌లు ఇస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. అన్ని సంక్షేమ పథకాలలో కనీసం 80శాతం నుంచి గరిష్ఠంగా 95 వరకు సంతృప్తి శాతం పెంచాలన్నారు.


