News December 2, 2025

రొయ్యల చెరువు అడుగు పాడైనట్లు ఎలా గుర్తించాలి?

image

కొన్నిసార్లు రొయ్యల చెరువులో నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఒకవేళ చెరువు అడుగు భాగం చెడితే రొయ్యల ఆరోగ్యం దెబ్బతింటుంది. చెరువు అడుగు భాగం పాడైనట్లు కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. కుళ్లిన గుడ్డు వాసన రావడం, రొయ్యలు చెరువు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు ఎక్కువగా చేరటం, అధిక బురద, రొయ్యలు బలహీనంగా మారటం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు.

Similar News

News March 23, 2026

మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి: చంద్రబాబు

image

AP: శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని CM చంద్రబాబు కొనియాడారు. ఆయన జయంతి వేళ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రానికి ముందే శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారన్నారు. లోకేశ్ సైతం ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. కాగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

News March 23, 2026

రాజధాని డిజైన్లకే రూ.401 కోట్లా: YCP

image

AP: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాల డిజైన్ల పేరిట CBN, ఆయన బినామీలు రూ.కోట్లు కొట్టేస్తున్నారని YCP ఆరోపించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి డిజైన్లు గీసి ఇవ్వడానికే దాదాపు రూ.401 CR ఖర్చు పెడుతున్నారని పేర్కొంది. 2016లో ఓ జపాన్ సంస్థకు, 2017లో జెనిసిస్ ప్లానర్స్‌కు రూ.113CRకు కాంట్రాక్టు ఇచ్చి రద్దు చేశారని తెలిపింది. 2024లో మళ్లీ జెనిసిస్‌కు రూ.137CRకు కాంట్రాక్టు ఇచ్చారని విమర్శించింది.

News March 23, 2026

‘ధురంధర్-2’: 4 రోజుల్లోనే రూ.761కోట్లు

image

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్- 2’ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.761కోట్లు(గ్రాస్) సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇండియాలోనే రూ.550కోట్లు రావడం విశేషం. తొలి 2,3 రోజులతో పోల్చితే నాలుగో రోజు(ఆదివారం) భారీగా కలెక్షన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ వీకెండ్‌లోపు రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.