News December 2, 2025

ఫైనల్స్‌కు మహబూబ్‌నగర్- వరంగల్ బాలికల జట్లు

image

సిరిసిల్లలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్, వరంగల్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈరోజు ఉదయం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు నిజామాబాద్ జట్టుపై విజయం సాధించగా, రెండో సెమీ ఫైనల్‌లో వరంగల్ జట్టు నల్గొండ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News March 14, 2026

రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చోప్రా

image

IPL-2026లో MI తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్‌గా కాకుండా పూర్తిస్థాయి ప్లేయర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. రోహిత్ ప్రస్తుతం గతంలో కంటే ఫిట్‌గా ఉన్నారని, ఆయన సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్దిక్‌కు హెల్ప్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గత సీజన్‌లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేశారు.

News March 14, 2026

కోదాడలో కల్తీ వంటనూనె కలకలం

image

కోదాడ పట్టణంలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపారు. కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రజలు ఆహార కల్తీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News March 14, 2026

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

image

భారత్‌లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్‌లో నిలిచాయి.