News December 2, 2025
HYD: రైల్వే ఫుడ్‌లో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం

నాగపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తున్న ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశారు. రైల్వే ఫుడ్ ఓపెన్ చేసి తినే సమయంలో ఒక్కసారిగా దాంట్లో బొద్దింక కనబడటంతో షాక్ అయ్యాడు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యతపై చర్యలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను డిమాండ్ చేశారు.
Similar News
News March 24, 2026
HNK: గంజాయి విక్రయ కేసులో ఇద్దరికి 5 ఏళ్ల జైలు శిక్ష

హన్మకొండలో ఎండు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులకు కోర్టు కఠిన శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి తీర్పు వెల్లడించారు. 2023 జూలై 28న సుబేదారి పోలీసులు వడ్డెపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇద్దరిని పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
News March 24, 2026
వార్ ఎఫెక్ట్.. రూ.48 లక్షల కోట్లు ఆవిరి

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి(FEB 28) నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 8,590 పాయింట్లు(10.56శాతం), నిఫ్టీ 2,666 పాయింట్లు(10.58 శాతం) పడిపోయాయి. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఏకంగా రూ.48.29 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.463 లక్షల కోట్ల నుంచి రూ.415 లక్షల కోట్లకు పడిపోయింది.
News March 24, 2026
నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పూర్తి?

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. నిన్న అసెంబ్లీ హాలులో CM రేవంత్, PCC చీఫ్ మహేశ్, కీలక మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. AICC ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగా లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


