News December 2, 2025

రాజ్ భవన్ ఇకపై ‘లోక్ భవన్’

image

గవర్నర్ అధికారిక నివాస, కార్యాలయ భవనం రాజ్ భవన్ పేరు మారింది. ‘లోక్ భవన్‌’గా మారుస్తూ గత నెల 25న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై దేశంలోని రాజ్ భవన్‌‌లను లోక్ భవన్‌గా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరు మార్చగా తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చనున్నారు. కాగా దీనిపై రెండేళ్ల క్రితమే గవర్నర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News March 27, 2026

TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత…

image

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న <<19491261>>కవిత<<>> కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.

News March 27, 2026

ప్రతి చిన్న విషయానికి సారీ అక్కర్లేదు: సమంత

image

ఒకే పరిస్థితి ఎదురైనప్పుడు మగాళ్లతో పోలిస్తే మహిళలు 10రెట్లు ఎక్కువగా సారీ చెబుతున్నారని నటి సమంత అన్నారు. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదని, తమను తాము తగ్గించుకోవడం ఆపాలని కోరారు. ఇక మూవీ ఇండస్ట్రీలో లేడీ యాక్టర్లు గుర్తింపునకు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. లేడీ ఓరియంటెడ్ మూవీలను రిస్క్‌లాగా చూడటం ఆపాలని ముంబైలో జరిగిన ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలో తెలిపారు.

News March 27, 2026

బ్లడ్‌బాత్.. ₹9 లక్షల కోట్లు ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 487 పాయింట్లు కోల్పోయి 22,819 వద్ద, సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ₹9 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, ONGC, TCS, విప్రో, ఎయిర్‌టెల్, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠానికి(94.82) పడిపోయింది.