News December 2, 2025
రూపాయి నేల చూపు.. మరింత కనిష్ఠ స్థాయికి!

రూపాయి నేలచూపులు చూస్తోంది. వరుసగా ఐదో సెషన్‌లోనూ క్షీణించి ఇవాళ రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే 89.874 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. అంతకుముందు All time low 89.895ను తాకి 90కి చేరువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం వరకు రూపాయి పడిపోయింది. అమెరికా డాలర్ బలపడటం, ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యమవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 20, 2026
టెన్త్ పరీక్షల రద్దుపై క్లారిటీ

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దవుతాయనే ప్రచారంపై విద్యా కమిషన్ OSD డా.జీనత్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయమని ఎక్కడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం 11వ తరగతి (ఇంటర్ ఫస్టియర్) పబ్లిక్ పరీక్షల రద్దుకే ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. SSC బోర్డు, ఇంటర్ బోర్డు (BIE) విలీనానికి కమిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.
News March 20, 2026
బీసీసీఐ నాపై వివక్ష చూపింది: శివరామకృష్ణన్

మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐ కామెంట్రీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బోర్డుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘23 ఏళ్లుగా పెద్ద మ్యాచ్‌లకు టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్లకు నన్ను వాడుకోకుండా BCCI వివక్ష చూపింది. నా పాత్రను పరిమితం చేసింది. నా తర్వాత వచ్చిన వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. ఆత్మ గౌరవాన్ని కోల్పోయి పనిచేయలేను’ అని SMలో పోస్టులు చేశారు.