News December 2, 2025
ఖమ్మం: 20 ఏళ్ల కింద తోడికోడళ్లు.. ఇప్పుడు అన్నదమ్ములు

పెనుబల్లి మండలం యడ్లబంజరు గ్రామ పంచాయతీలో ఆసక్తికర రాజకీయ పోరు నెలకొంది. 20 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న ఈ గ్రామంలో, ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు రాజిన్ని అప్పయ్య, రాజిన్ని రాంబాబు సర్పంచ్ బరిలో నిలుస్తున్నారు. 2 దశాబ్దాల కిందట తోడికోడళ్లు పోటీ పడగా, రాంబాబు, ఆయన భార్య సునీత గతంలో 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఒకే కుటుంబం కావడంతో ఈ పోటీ అనివార్యమైంది.
Similar News
News March 30, 2026
విశాఖ కోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

విశాఖ జిల్లా కోర్టు కార్యక్రమాలు సోమవారం ఉదయం ప్రారంభం కాగానే ఎల్లమ్మ తోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కోర్టు కార్యక్రమాలు ప్రారంభం అవుతున్న సమయంలో న్యాయమూర్తి ముందు బల్లపై ఓ లేఖ పెట్టి వెంటనే పురుగు మందు తాగి కుప్పకూలిపోయాడు. అతనిని కేజీహెచ్‌కు తరలించారు. కోర్టుకు ఎందుకువచ్చాడు.. లేఖలో ఏమి రాశాడు అనేది తెలియాల్సి ఉంది.
News March 30, 2026
వాహనదారులకు షాక్.. పెరిగిన CNG ధర

TG: CNG వాహనదారులకు షాక్ తగిలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దిగుమతికి ఆటంకంతో సరఫరా మరింత తగ్గింది. ఇదే సాకుతో గ్యాస్ కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయి. 3 రోజుల క్రితం వరకు కిలోపై అదనంగా ₹1 చొప్పున వసూలు చేసిన HYDలోని ఓ PVT గ్యాస్ కంపెనీ ఆ తరువాత నుంచి మరో రూ.2 పెంచి విక్రయిస్తోంది. వారం కిందట ఈ ధర ₹96గా ఉండగా శనివారం నుంచి అన్ని బంకుల్లో KG ₹99 చొప్పున CNG స్టేషన్లలో వసూలు చేస్తున్నారు.
News March 30, 2026
NTR: ఏప్రిల్ 1తో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో NOV 2025లో నిర్వహించిన ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ 3వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 1లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.


