News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News March 17, 2026
మెదక్: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో పాఠశాలలో అటెండర్‌గా పనిచేసిన సారా జైపాల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనలో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
News March 17, 2026
RMPT: ఖేలో ఇండియా ఉషు లీగ్‌లో గోల్డ్ మెడల్

నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన ‘అశ్మిత ఖేలో ఇండియా ఉషు లీగ్’ పోటీల్లో రామాయంపేటకు చెందిన జమాల్‌పూర్ హీనా మాధురి గోల్డ్ మెడల్ సాధించింది. సీనియర్ 75 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉషు సంఘం ప్రతినిధులు, కోచ్ సాయికృష్ణ ఆమెను అభినందించారు. తన ప్రతిభను ప్రోత్సహించిన తల్లిదండ్రులు సుశీల-మల్లేశంకు మాధురి కృతజ్ఞతలు తెలిపారు.
News March 16, 2026
అంగన్‌వాడీల అరెస్టులు దుర్మార్గం: సీఐటీయూ

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని అక్రమ అరెస్టులకు పాల్పడటంపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మండిపడ్డారు. సోమవారం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీలను దారిలోనే అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ వేదికగా సమస్యలపై చర్చించి, వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే అణచివేయడం సరికాదన్నారు.


