News December 2, 2025

రెండు దశల్లో జనగణన: కేంద్రం

image

జనగణనను రెండు దశల్లో చేపట్టనున్నట్లు లోక్‌సభలో కేంద్రం స్పష్టతనిచ్చింది. 2026 APR-SEP మధ్య రాష్ట్ర ప్రభుత్వాల సౌలభ్యాన్ని బట్టి ఏవైనా 30 రోజుల్లో ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది. రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరిలో జనగణన ఉంటుందని తెలిపింది. జనాభా లెక్కింపులో కులగణన చేపట్టనుంది. J&K, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాక్ వంటి మంచు ప్రాంతాల్లో 2026 SEPలో జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది.

Similar News

News March 14, 2026

ఒక్కరోజే 2,37,123 గ్యాస్ సిలిండర్ల పంపిణీ

image

TG: డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా జరిగే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12K సిలిండర్లు అధికం కావడం విశేషం. IOCL 83,166, HPCL 88,257, BPCL 65,700 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాయి. GOVT కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టపడింది.

News March 14, 2026

ఇన్‌స్టాలో అవి చూసి మోసపోకండి!

image

ఇన్‌స్టాలో ఏదైనా వస్తువు కనిపించగానే అరే.. బాగుందే అనుకుంటాం. రేట్ కూడా తక్కువే ఉంది కదా కొందామని చూస్తే COD ఉండదు. వెంటనే ఆన్‌లైన్ పేమెంట్ చేసి బుక్ చేస్తాం. కానీ ఎన్నిరోజులైనా అది మీకు డెలివరీ అవ్వదు. ఎందుకంటే అది ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్. ఇలాంటి సైట్లు కుప్పలుగా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలు వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెంప్ట్ అవ్వకుండా ట్రస్టెడ్ సైట్లలోనే షాపింగ్ చేయండి.

News March 14, 2026

NDAతో పొత్తు ఉండదు: విజయ్

image

TNలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో NDAతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. వారితో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలే అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. BJP తమకు సైద్ధాంతిక శత్రువు అన్నారు. పార్టీ అధికారిక ప్రకటన ఇస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలని కార్యకర్తలకు సూచించారు.