News December 2, 2025
టీటీడీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి అర్హతల నిర్ణయం

టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి నియామకంలో కొన్ని అర్హతలకు సంబంధించి సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సంస్కృతం, తమిళం, తెలుగు భాషల మీద పట్టు, పీహెచ్డీతో పాటు మరికొన్ని అర్హతలు కలిగి ఉండాలంది. నేరుగా నియామకం లేదా డిప్యూటేషన్ ద్వారా నియామకం చేసుకోవచ్చని జీవోలో పేర్కొంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని సూచించారు.
Similar News
News March 18, 2026
భారీ వర్ష సూచన.. జాగ్రత్త!

‘ఈ రోజు మీ ప్రాంతంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. అప్రమత్తంగా ఉండండి’ అంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నంద్యాల జిల్లా ప్రజల ఫోన్లకు సందేశాలు పంపింది. పొలాలకు వెళ్లినవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే జిల్లాలో పలు చోట్ల వర్షం మొదలైంది.
News March 18, 2026
మాజీ MLA పిన్నెల్లికి బెయిల్

గుండ్లపాడు జంట హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బుధవారం బెయిల్ మంజూరైంది. జంట హత్య కేసులో ఆయన 6వ నిందితుడు. 98 రోజులుగా నెల్లూరు జిల్లా జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు బెయిల్ రాలేదు.
News March 18, 2026
గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలపై పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ

గ్రామీణ డాక్ సేవక్‌ల పని ప్రదేశాల్లో స్థితిగతులపై మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పార్లమెంట్‌లో మాట్లాడారు. వెనకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు పెంచే ప్రక్రియ చేసిందా, ఇప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టులు నింపడం, మౌళిక వసతుల పెంపు, డిజిటల్ ట్రైనింగ్ లాంటి కార్యక్రమాలు పెంచి పోస్టల్ సర్వీస్‌ను మెరుగుపరిచే కార్యక్రమం చేసిందా అని అడిగారు. ఆయన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.


