News December 2, 2025
ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా భీమవరం: కలెక్టర్ నాగరాణి

జిల్లా కేంద్రం భీమవరంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ నయీం అస్మితో కలిసి ట్రాఫిక్ అవరోధాలు, రోడ్డు ఆక్రమణ, సక్రమ పార్కింగ్, భద్రత లేని డ్రైవింగ్ తదితర అంశాలపై చర్చించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 19, 2026
ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.
News March 19, 2026
భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
News March 19, 2026
తణుకు: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.


