News December 2, 2025
సంగారెడ్డి: రేపు కలెక్టరేట్‌లో దివ్యాంగుల దినోత్సవం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ఈనెల 3న అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మంగళవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందిస్తామని చెప్పారు. కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
Similar News
News March 16, 2026
తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకు కేడీసీసీబీ బ్యాంక్

కరీంనగర్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏటా వంద కోట్ల లాభలతో ప్రభుత్వ ప్రధాన బ్యాంకులకు ధీటుగా సేవలు అందిస్తూ తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకి ఎంపికైనట్లు సీఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ ఆవార్డును 17వ తేదిన సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందని, ఇది అందరి సమిష్టి విజయం అని తెలిపారు.
News March 16, 2026
మెదక్: తీవ్ర విషాదం.. పరీక్షకు వెళ్తూ మృతి

మనోహరాబాద్ మండలంలో ఆదివారం <<19387134>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇమాంపూర్ వాసి నిఖిల్(20) అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు మన్నె స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు బైక్‌పై ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 16, 2026
INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.


