News December 2, 2025

గద్వాల: సైబర్ నేరాలపై అవగాహన ప్రచారం: ఎస్పీ

image

గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘సైబర్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత పౌరుని హక్కు అని ఆయన అన్నారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ అవగాహన శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం ఎస్పీ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

Similar News

News March 8, 2026

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

image

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 8, 2026

పోలవరం: అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

image

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు చుక్కెదురైంది. ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సిట్ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ల నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

News March 8, 2026

మెకుతు సీమలో అన్నింటా ‘ఆమె’

image

అన్నిరంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఆయా నుంచి కలెక్టర్ వరకు తమ మార్కు చూపిస్తున్నారు. మెతుకుసీమలోని మూడు జిల్లాల కలెక్టర్లు, సీపీ మహిళలే. ప్రభుత్వ కీలకశాఖల్లో, పల్లెలు, పట్టణాల్లో ప్రజాప్రతినుధులుగా, ప్రధాన పార్టీల జిల్లా అధ్యక్షురాలుగానూ మహిళామణులు రాణిస్తున్నారు. అటుపరిపాలనలో.. ఇటూ రాజకీయాల్లో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు మెతుకు సీమ మహిళామణులు.
Happy Women’s Day