News December 2, 2025
‘మెగా పీటీఎం 3.Oకు రూ.9.84 కోట్లు కేటాయింపు’

ఈనెల 5న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ డే (పి.టి.ఎం 3.0) కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.84 కోట్లు కేటాయించింది. రాష్ట వ్యాప్తంగా 45,190 సర్కారు పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురం(D) భామిని ఏపీ మోడల్ స్కూల్లోని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు.
Similar News
News March 18, 2026
కందుకూరు లేఅవుట్ పనులు జూన్ లోపు పూర్తి చేయాలి: జేసీ

అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు అహుడా లేఅవుట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను జేసీ విష్ణుచరణ్ పరిశీలించారు. డ్రైనేజీలు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ నెలలోపు అన్ని పనులు పూర్తి చేయాలని, పక్షం రోజులకు ఒకసారి పురోగతి నివేదిక సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో అహుడా అధికారులు పాల్గొన్నారు.
News March 18, 2026
బాపట్ల: ఇంటర్ పరీక్షకు 154 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 154 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ పేర్కొన్నారు. బుధవారం ఇంటర్ పరీక్షకు 7,670 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7,516 మంది మాత్రమే హాజరయ్యారన్నారు మిగిలిన 154 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. జిల్లాలో బుధవారం నాడు ఇంటర్ పరీక్ష ఎటువంటి కాపీయింగ్ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందన్నారు.
News March 18, 2026
కామారెడ్డిలో ఎక్సైజ్ దాడులు.. అల్ఫాజోలం స్వాధీనం

కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు బుధవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఆల్ఫాజోలం నిల్వ ఉంచిన వ్యక్తులను పట్టుకుని సుమారు 220 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆల్ఫాజోలం, రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి 110 గ్రాముల అల్పోజోలం , 106 గ్రాముల ఆల్ఫాజోలం స్వాగతం చేసుకున్నారు. మొత్తం 4 కేసులు నమోదు చేసి, నిందితులపై NDPS చట్టం కింద చర్యలు తీసుకున్నారు.


