News December 2, 2025

WNP: రేపటి నుంచి మూడో దశ పంచాయతీ నామినేషన్లు

image

మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 3 నుంచి ప్రారంభం కానుంది. వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్, శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల్లో మొత్తం 87 పంచాయతీలలో 806 వార్డులకు నామినేషన్ల అభ్యర్థులు వేరు ఉన్నారు. అధికారులు ఐదు మండలాలలో 34 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మండలాల్లో కొన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక జోరుగా కొనసాగుతుంది.

Similar News

News March 8, 2026

నిర్మల్: ఆ కుటుంబంలో ‘ఆమె’ కీలకం

image

నిర్మల్ జిల్లా పెద్ద బెల్లాల్‌కి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు TGPSC ద్వారా ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. జాడి విజయలక్ష్మి ఆర్‌అండ్‌బీ శాఖలో ఏఈగా, ఆమె వదిన చంద్రకళ వీఆర్వోగా, మరో వదిన జ్యోతి గ్రూప్-2 ద్వారా ఎంపీఓగా ఎంపికయ్యారు. ప్రస్తుతం జ్యోతి సోన్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన వీరిపై ప్రశంసలు వస్తున్నాయి.
HAPPY WOMENS DAY

News March 8, 2026

నెల్లూరు: వారిని జైలు కలిపింది.!

image

ఆ ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు. వీరిలో రామకృష్ణపై 27 కేసులు, మరో నిందితుడు బిట్రగుంటకు చెందిన మాల్యాద్రిపై14 కేసులు ఉన్నాయి. జైలులో వీరికి పరిచయం ఏర్పడడంతో మరిన్ని చోరీలకు కలిసికట్టుగా చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా చిన్న బజార్ PS పరిధిలో <<19323990>>చేతివాటం<<>> చూపగా ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.63 వేల నగదు, 153 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

News March 8, 2026

ములుగులో అంతర్జాతీయ సదస్సు

image

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 10, 11 తేదీల్లో “కథా సాహిత్యం-సామాజిక చైతన్యం” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కథా సాహిత్యం, సామాజిక చైతన్యానికి మధ్య గల సంబంధాన్ని అంతర్జాతీయ కోణంలో ఈ సదస్సులో చర్చించనున్నట్లు సంచాలకులు బి.బాలయ్య తెలిపారు.