News December 2, 2025

VKB: డీసీసీ అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకున్న ధారాసింగ్

image

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన ధారా సింగ్‌కు ఆమె నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పార్టీని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.

Similar News

News March 23, 2026

DANGER: ఈ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటున్నారా?

image

హ్యాకర్లకు చిక్కకూడదంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. ‘12-16 అక్షరాల పాస్‌వర్డ్‌లో A-Z, a-z, 0-9, స్పెషల్ క్యారెక్టర్స్ (@, #, $, &) ఉండేలా చూసుకోండి. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఫోన్ నంబర్లు వాడకండి. 123456 లేదా password వంటివి అస్సలు వద్దు. ప్రతి అకౌంట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్స్ వాడుతూ కాలానుగుణంగా వాటిని మారుస్తూ ఉండండి’ అని సూచించింది.

News March 23, 2026

అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలి: పెద్దపల్లి కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, కార్యాలయాలను శుభ్రంగా ఉంచి, ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలను వేచి ఉంచకుండా, దరఖాస్తులను మానవతా దృక్పథంతో త్వరగా పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు.

News March 23, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. ఇన్విజిలేటర్‌ రిలీవ్

image

జిల్లాలో పదో తరగతి ఆంగ్ల పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 99.89 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. బోనకల్ జెడ్పీహెచ్ఎస్ కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 16,918 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని వివరించారు.