News December 2, 2025
NGKL:జర్నలిస్టుల మహాధర్నాను విజయవంతం చేయాలి

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ DEC 3న HYD I&PR కమిషనర్ కార్యాలయం వద్ద TUWJ(IJU) ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని టెమా పాలమూరు జిల్లా కన్వీనర్ అహ్మద్ పాష పిలుపునిచ్చారు. అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. అక్రిడిటేషన్ పాలసీ ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని అన్నారు
Similar News
News March 18, 2026
కాకినాడ: ఎట్టకేలకు రూటుమార్చిన పులి.. ఎటువైపు అంటే.?

19 రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పెద్దపులి ఎట్టకేలకు తన గమ్యాన్ని మార్చుకుంది. వారం రోజులుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే తిరుగుతూ బెంబేలెత్తించిన పులి, ఇప్పుడు పొరుగు జిల్లా వైపు మళ్లింది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రత్తిపాడులోని బాపన్నధార రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా పోలవరం జిల్లా అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు.
News March 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

♦ డయేరియా ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
♦పాతపట్నం సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే గోవింద్
♦ టెక్కలి: భూములు ఇవ్వమంటూ రైతుల నిరసన
♦ జిల్లాలో దివ్యంగ శక్తి పథకం ప్రారంభం
♦శ్రీకాకుళం: మామిడి కాయలు కొరత
♦ నరసన్నపేట: జూనియర్ క్రీడా మైదానంలో నాగుపాము సంచారం
♦ టెక్కలి: రెండు నెలలలో ఇద్దరు కిడ్నీ రోగులు మృతి
News March 18, 2026
చీరాల 1 టౌన్ ఎస్ఐ భాస్కరరావు మృతి

చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆయనకు ఇంటి వద్ద హార్ట్‌ఎటాక్ వచ్చింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ మొయిన్, సీఐలు సుబ్బారావు, అశోక్ కుమార్, మల్లికార్జునతో పాటు పోలీసులు నివాళులు అర్పించారు. ఆయన 42 ఏళ్ల నుంచి పోలీస్ విభాగంలో సేవలందించారన్నారు.


