News December 2, 2025
సిరిసిల్ల: అందని సర్టిఫికెట్లు.. ఉత్కంఠలో అభ్యర్థులు

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు పెద్ద సవాలుగా మారింది. సర్వర్ పని చేయకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. మ్యాన్యువల్‌గా సర్టిఫికెట్లు జారీచేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మూడో విడత నామినేషన్‌లు రేపటి నుంచే మొదలుకానున్నాయి. సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడంతో అనుకున్న ముహుర్తానికి నామినేషన్ వేస్తామో లేదో అని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News March 15, 2026
అనకాపల్లి: QR కోడ్ స్కాన్ చేసి సెంటర్ వివరాలు తెలుసుకోండి..

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్స్‌పై ప్రత్యేకంగా క్యూర్ కోడ్ ముద్రించారు. ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే విద్యార్థుల పరీక్ష కేంద్రానికి వెళ్లే దారితో పాటు వివరాలు తెలుస్తాయని కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సుకుమార్ తెలిపారు. దీనివల్ల పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కునే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
News March 15, 2026
పాలమూరు: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

కాచిగూడ-మదురై ప్రత్యేక రైలును రైల్వే శాఖ రెగ్యులరైజ్ చేసింది. KCG నుంచి తూత్తుకుడి వైపు వెళ్లే రైలు ఏప్రిల్ 6 నుంచి ప్రతి సోమవారం నడుస్తుంది. తూత్తుకుడి-కాచిగూడ వైపు వచ్చే సర్వీసు ఏప్రిల్ 8 నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. 07191/07192 స్పెషల్ రైళ్ల స్థానంలో ఇకపై 17615/17616 నంబర్లతో ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. షాద్‌నగర్, జడ్చర్ల, MBNR, వనపర్తి రోడ్, గద్వాల్ గుండా స్టాఫ్‌లు ఉన్నాయి.
News March 15, 2026
వారికి LPG సిలిండర్లు బంద్.. కేంద్రం ప్రకటన

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయవద్దని కేంద్రం ఆదేశించింది. PNG వినియోగించుకుంటూనే డొమెస్టిక్ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే LPG కనెక్షన్లు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా LPG కనెక్షన్లూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో HYDతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో PNG సౌకర్యం ఉంది.


