News December 2, 2025
గద్వాల డీసీసీ అధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డికి బాధ్యతలు

గద్వాల జిల్లా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డి నియామకం అయిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజీవ్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
Similar News
News March 13, 2026
అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.6వేలు

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.6వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కృష్ణా(D) గన్నవరంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
News March 13, 2026
గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్‌కు 45 రోజుల గడువు

వంట గ్యాస్ సరఫరాపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ తర్వాత మరో సిలిండర్ బుకింగ్‌కు కనీసం 45 రోజుల గడువు ఉండాలని నిర్ణయించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 25 రోజుల నిబంధనే కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడమే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
News March 13, 2026
అన్నదాతా సుఖీభవ-అర్హత ఇలా తెలుసుకోవచ్చు

ఆన్‌లైన్‌లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్‌కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.


