News April 18, 2024

21న అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్న చంద్రబాబు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 21న తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేయనున్నారు. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు స్వయంగా అందిస్తారు. ఎక్కడైనా మార్పులు, చేర్పులు ఉంటే ఒకట్రెండు రోజుల్లోనే తేల్చేయనున్నారు. కాగా ఇవాళ ఆయన పార్టీ జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమయ్యారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

Similar News

News January 26, 2026

కాకినాడలో రిమోట్‌తో ఎగిరిన భారీ జెండా

image

కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం గణతంత్ర వేడుకలు వినూత్నంగా జరిగాయి. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ రిమోట్ కంట్రోల్ ద్వారా 100 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. DRO వెంకట్రావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ విశేషంగా ఆకట్టుకుంది.

News January 26, 2026

మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్..! ఆమె సేఫేనా?

image

AP: కర్నూలులో ఈనెల 9న నర్సు HIV ఇంజెక్షన్ ఇచ్చిన లేడీ డాక్టర్‌కు వైరస్ సోకే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలిపారు. వసుంధర గతనెల 28న వైరస్ బ్లడ్ సేకరించి ఫ్రిజ్‌లో ఉంచడంతో అన్ని రోజులు వైరస్ బతకదన్నారు. కానీ రక్త గ్రూప్ తదితరాలతో ముప్పుపై అప్రమత్తత అవసరమని చెప్పారు. వసుంధర ప్రేమించిన డాక్టర్ మరో డాక్టర్‌ను పెళ్లి చేసుకోగా, అతడిని సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించి ఇంజెక్షన్ ఇవ్వడం తెలిసిందే.

News January 26, 2026

20 నిమిషాలకో ఇండియన్ అరెస్ట్

image

భవిష్యత్తు ఆశతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయులు అధికంగా పట్టుబడుతున్నారు. ఆ దేశ సరిహద్దుల్లో 2025లో ప్రతి 20 నిమిషాలకో ఇండియన్ అరెస్టయ్యారు. గత ఏడాది 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది వివిధ దేశాలకు చెందిన 3.91L మంది అరెస్టయ్యారు. కెనడా, మెక్సికో సరిహద్దుల్లో ఎక్కువ మంది పట్టుబడుతున్నారు.