News December 2, 2025
ఏలూరు: పల్స్ పోలియోపై డీఎంహెచ్‌ఓ సమీక్ష

ఏలూరులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రాబోయే పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై డీఎంహెచ్‌ఓ డా. అమృతం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 21న జరగబోయే కార్యక్రమం గురించి ఆమె పలు అంశాలను వివరించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శోభ టీకా భద్రపరిచే విధానం, బృందాల సమన్వయంపై మెడికల్ ఆఫీసర్లకు ప్రత్యేక సూచనలు చేశారు.
Similar News
News March 20, 2026
‘ధురంధర్-2’తో ఆ డైరెక్టర్లు బెదిరిపోతారు: RGV

‘ధురంధర్-2’పై మరోసారి ప్రశంసలు కురిపించిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రొటీన్ సినిమాలు తీసే దర్శకులపై ఫైర్ అయ్యారు. హీరోలను దేవుడిలా కొలుస్తూ ఫిజిక్స్, గ్రావిటీతో సంబంధం లేని చిత్రాలు తీసే డైరెక్టర్లకు ఇది వణుకుపుట్టిస్తుందన్నారు. దీంతో అసలైన హీరోయిజం పుట్టిందని.. ఇప్పుడు రొటీన్ స్టార్ హీరోలంతా జోకర్లుగా కనిపిస్తున్నారని విమర్శించారు. రొటీన్ యాక్షన్ మూవీలను ఇకపై ఆడియన్స్ చూడరని ట్వీట్ చేశారు.
News March 20, 2026
కేయూ: బీ.ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ టైమ్ టేబుల్ విడుదల

బీ.ఫార్మసీ (CBCS) ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభమై 30 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. వరంగల్, హనుమకొండ సహా పలు కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని వివరాలను అధికారిక వైబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
News March 20, 2026
ఆసీస్ ప్లేయర్లు కావాలనే రావడం లేదా?

IPL ఆరంభ మ్యాచులకు కమిన్స్(SRH), స్టార్క్(DC), హేజిల్‌వుడ్(RCB) రావడం లేదు. ఎల్లిస్(CSK) సీజన్ మొత్తానికి దూరమయ్యారు. గాయాల భయంతో ఆస్ట్రేలియన్లు IPL ఆడేందుకు ఇష్టపడడం లేదని, కావాలనే మ్యాచులకు డుమ్మా కొడుతున్నట్లు కొందరు IND ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్రాంచైజీల నుంచి రూ.కోట్లు తీసుకుంటూ స్వదేశం తరఫున ఆడేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాంటప్పుడు వేలంలో పాల్గొనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?


