News December 2, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* కామారెడ్డి: పోస్టల్ బ్యాలెట్ కు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలి
* నాగిరెడ్డిపేట్: ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం
* బిచ్కుంద: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ బిజెపి నాయకులు
*లింగంపేట్: మండలంలో చిరుత పులి సంచారం
* గాంధారి: సోమారం సర్పంచ్ ఏకగ్రీవం
* బిక్కనూర్: కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
* మూడో విడత నామినేషన్లకు సర్వం సిద్ధం
Similar News
News March 16, 2026
గద్వాలలో రేపు భారీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గద్వాల జిల్లా ఇన్‌ఛార్జ్ ఉపాధి కల్పనాధికారి లక్ష్మి సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. 17న ఉదయం 11:00 నుంచి 2:00 వరకు ఐడీఓసీ కాంప్లెక్స్ ఎఫ్ 30/1లో ఉంటుందన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బీటెక్ చదివి 18 నుంచి 35 ఏళ్ల నిరుద్యోగ యువత హాజరు కావాలన్నారు. వివరాలకు 8374347445 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News March 16, 2026
BIG BREAKING: ADB: మాజీ MLA మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మాజీ MLA అజ్మీరా గోవింద్ నాయక్ కాసేపటి క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం ఆయన దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఉన్న తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3 సార్లు MLAగా గెలుపొందారు. మొదటి సారి ఇండిపెండెంట్‌గా గెలవగా ఆ తర్వాత TDP, BRS నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంత కాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యారు.
News March 16, 2026
గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు

LPGకి హైడిమాండ్ నెలకొన్న వేళ PNG కనెక్షన్లకు ప్రజలను ఆకర్షించేందుకు గ్యాస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. MAR 31లోగా రిజిస్టరయ్యే డొమెస్టిక్ యూజర్లకు GAIL, ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థలు ₹500 విలువైన ఫ్రీ గ్యాస్ అందించనున్నాయి. మహానగర్ గ్యాస్.. కమర్షియల్ కనెక్షన్ల సెక్యూరిటీ డిపాజిట్ (₹1L-5L), డొమెస్టిక్ రిజిస్ట్రేషన్ ఫీ (₹500)పై మినహాయింపు ఇచ్చింది. BPCL కూడా కమర్షియల్‌పై జీరో డిపాజిట్ ప్రకటించింది.


