News December 2, 2025

జగిత్యాల: ‘సైబర్ భద్రత ప్రతి పౌరుడి బాధ్యత’

image

సైబర్ భద్రత ప్రతి పౌరుని బాధ్యత అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ‘ఫ్రాడ్ క ఫుల్ స్టాప్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్ ఆడిటోరియం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల గురించి రక్షించుకోవాలంటే అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

సిద్దిపేట: ఘోర ప్రమాదం.. ఇద్దరు బాలురు మృతి

image

మిరుదొడ్డిలో <<19418573>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన ముగ్గురు బాలురిలో చెన్నయ్ నితిన్‌ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మరో బాలుడు పిట్ల రామ్ చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మరో బాలుడు సాన హర్షవర్ధన్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నాడు.

News March 18, 2026

పుదుచ్చేరిలో ఎన్నికలు.. ‘జిల్లాలో మూడు చోట్ల చెక్ పోస్టులు’

image

పుదుచ్చేరి, యానాం ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకు నీలపల్లి, మల్లవరం, సుంకరపాలెం వద్ద 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు. అక్రమ మద్యం, నగదు, ఓటర్లకు పంచే సామాగ్రి తరలిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

News March 18, 2026

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం

image

కీసరగుట్టలోని శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ ప్రత్యేకంగా అన్నాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అన్నాభిషేకం చేసి స్వామికి అభిషేకించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా అందించారు.