News December 3, 2025
జగిత్యాల కళాశాలలో వసతులపై ఆడిట్ బృందం సంతృప్తి

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు అకాడమిక్ ఆడిట్ బృందం నేడు తనిఖీ చేసింది. హుజురాబాద్ ప్రిన్సిపల్ డా. పి. ఇందిరా దేవి, డా. శ్రీనివాస్ విభాగాలను పరిశీలించారు. అధ్యాపకులు విద్యార్థుల విజయాలను వివరించారు. వసతులు, వనరులపై ఆడిట్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశంలో ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ, స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News March 20, 2026
గోదావరి నదిలో గల్లంతైన వారి వివరాలు ఇవే..!

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలోకి దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.
News March 20, 2026
‘పోలవరం జిల్లాలో గ్యాస్ కొరత లేదు’

పోలవరం జిల్లాలోని 8గ్యాస్ ఏజెన్సీలలో 1872 వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ విజయ భాస్కర్ శుక్రవారం తెలిపారు. రంపచోడవరంలో జీసీసీ గ్యాస్ గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ బుక్ ప్రకారం 352 సిలిండర్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఎటువంటి కొరతలేదని, బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం 352 మంది గ్యాస్ కోసం నమోదు చేసుకున్నారన్నారు.
News March 20, 2026
పండుగలు సమాజానికి కళాశోభను ఇస్తాయి: చిత్రకారుడు రుస్తుం

పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన గీసిన ‘రంజాన్ ముబారక్’ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావానికి, సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. సమాజంలో ధనవంతులు పేదవారి ఆకలిని గుర్తించి చేయూతనివ్వాలని కోరారు. పవిత్ర ఖురాన్ మార్గంలో నడుస్తూ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.


