News December 3, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పట్టనున్న మహార్దశ

రూ.5,000 కోట్లతో NHలు, రూ.4,000 కోట్లతో రైల్వే లైనుతో ఉమ్మడి KNR జిల్లా ప్రయాణికులకు మహార్దశ పట్టనుంది. JGTL-KNR వరకు 58.60 KMల మేర 4 లైన్ల విస్తరణకు రూ.2484 కోట్లు, JGTL-MNCL వరకు 62.29 KMల మేర 4 లైన్ల విస్తరణకు రూ.2548 మంజూరు కాగా ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ఇక రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కు రూ.4 వేల కోట్లు మంజూరయ్యాయి. మంథని-కాటారం-మేడారం-తాడ్వాయి-MNGR వరకు రైల్వేప్రయాణం సౌకర్యం ఏర్పడనుంది.
Similar News
News December 3, 2025
TG హైకోర్టు న్యూస్

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
News December 3, 2025
అన్నమయ్య జిల్లాలో తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయ నియామకాలు

అన్నమయ్య జిల్లా 17 మండలాల్లో 48 పాఠశాలల్లో D.Ed./ B.Ed. పూర్తి చేసిన అభ్యర్థులను 2025-26 విద్యా సంవత్సరానికి 5 నెలల వ్యవధికి తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయగా నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు.
News December 3, 2025
మోరంపూడి ఫ్లైఓవర్ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి

మోరంపూడి ఫ్లైఓవర్ కింద బుధవారం 30-35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతిచెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్‌స్టేషన్ 94407 96533 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.


