News December 3, 2025
హుస్నాబాద్: 4 లైన్లకు రేపు సీఎం శంకుస్థాపన

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు రేపు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.
Similar News
News March 25, 2026
విశాఖ: ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నిందితుడి అరెస్ట్

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.60 లక్షలు వసూలు చేసిన విశాఖకు చెందిన శ్యామ్ కుమార్‌ను విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. 2025లో పలువురి వద్ద నగదు తీసుకుని పరారైన నిందితుడిని,సాంకేతిక పరిజ్ఞానంతో మంగళవారం పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులు ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
News March 25, 2026
RDT: మొదలైన క్రెడిట్ వార్

అనంతపురం జిల్లా ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA లైసెన్సును పునరుద్ధరించింది. దీనిపై TDP, YCP మధ్య రాజకీయ క్రెడిట్ వార్ మొదలైంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషితోనే ఆర్డీటీకి శుభవార్త వచ్చిందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు తమ నేత తలారి రంగయ్య అవిశ్రాంత పోరాటంతోనే అనుమతులు వచ్చాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రెడిట్ వార్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీ కామెంట్..
News March 25, 2026
విజయనగరం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

విజయనగరం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం రాజాం ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.


