News December 3, 2025

2006 నివేదిక ప్రకారం అభివృద్ధి నివేదిక ఇవ్వండి: కలెక్టర్

image

మల్కిపురం మండలం శంకరగుప్తం మేజర్ డ్రెయిన్‌కు సంబంధించి 2006 నివేదిక ఆధారంగా జరిగిన అభివృద్ధి పనులపై పూర్తి నివేదిక రూపొందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ డ్రైనేజీ విభాగం ఇంజనీర్లను సూచించారు. అమలాపురం కలెక్టరేట్‌లో సమీక్షించిన ఆయన, డ్రైన్‌కు పూడికతీత చేపట్టకపోవడం వలన కలిగే నష్టాలపై అధికారులతో చర్చించారు.

Similar News

News March 12, 2026

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

image

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు ఉంది. ఎంపికైన బాలికల జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. ఏప్రిల్ 17 వరకు ధ్రువపత్రాలను పరిశీలించి సీటును కన్ఫామ్ చేస్తారు.

News March 12, 2026

దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

image

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.

News March 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,770
➤ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,508
➤ వెండి 10 గ్రాముల ధర రూ.2,720.