News December 3, 2025
2006 నివేదిక ప్రకారం అభివృద్ధి నివేదిక ఇవ్వండి: కలెక్టర్

మల్కిపురం మండలం శంకరగుప్తం మేజర్ డ్రెయిన్‌కు సంబంధించి 2006 నివేదిక ఆధారంగా జరిగిన అభివృద్ధి పనులపై పూర్తి నివేదిక రూపొందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ డ్రైనేజీ విభాగం ఇంజనీర్లను సూచించారు. అమలాపురం కలెక్టరేట్‌లో సమీక్షించిన ఆయన, డ్రైన్‌కు పూడికతీత చేపట్టకపోవడం వలన కలిగే నష్టాలపై అధికారులతో చర్చించారు.
Similar News
News March 30, 2026
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఒక ముఖ్యమైన బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయగా, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. బడ్జెట్ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
News March 30, 2026
రాష్ట్రంలో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్: కోమటిరెడ్డి

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గేమ్ ఛేంజర్‌గా మారనున్న ట్రిపుల్ ఆర్, బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చెన్నై, పూణే, బెంగళూరులను కలుపుతూ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందుకోసం శంషాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో ఏకంగా 500 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనున్నట్లు ఆయన సభలో వెల్లడించారు.
News March 30, 2026
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్’

దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్రంలో 22,441 ప్రమాదాలు జరిగి 6,221 మంది మృతి చెందడం విచారకరమన్నారు. ప్రాణాలు కాపాడే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రోడ్ల అభివృద్ధి కేవలం మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలను కాపాడే కీలక బాధ్యత అని ఆయన సభలో ఉద్ఘాటించారు.


