News December 3, 2025
జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలి: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద ‘రైతన్న మీకోసం’ గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో, 2025-26 రబీ, 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్ల పంట ప్రణాళికలపై రైతులతో తప్పక చర్చించాలని ఆమె సూచించారు.
Similar News
News March 14, 2026
US అప్పుడు ఇండియాను బెదిరించి ఇప్పుడు వేడుకుంటోంది: ఇరాన్

రష్యా నుంచి చమురు కొనవద్దని ఇండియాను అమెరికా కొన్ని నెలలపాటు బెదిరించిందని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరఘ్చి ట్వీట్ చేశారు. ఇరాన్‌తో 2 వారాల యుద్ధం తర్వాత ఆ పరిస్థితి మారిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని INDతో సహా మిగతా దేశాలను US వేడుకుంటోందని విమర్శించారు. ఇరాన్‌పై వార్‌కు మద్దతిస్తే రష్యాకు వ్యతిరేకంగా US సపోర్ట్ తమకు లభిస్తుందనుకున్న యూరప్‌కు ఎదురుదెబ్బ తగిలిందన్నారు.
News March 14, 2026
గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని అదనపు కలెక్టర్ నగేష్ స్పష్టం చేశారు. శుక్రవారం గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వినియోగదారులు సిలిండర్ బుక్ చేసిన 2-3 రోజుల్లోనే డెలివరీ చేసేలా చూడాలని ఆదేశించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
News March 14, 2026
సూర్యాపేట: గ్యాస్ పర్యవేక్షణకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు

సూర్యాపేట జిల్లాలో ఎల్పీజీ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా, పౌరసరఫరాల అధికారి కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ గ్యాస్ నిల్వలను రోజూ పర్యవేక్షిస్తుంది. సిలిండర్ల బ్లాక్ మార్కెట్, దారిమళ్లింపులో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. క్షేత్రస్థాయి నివేదికలను ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీకి పంపిస్తామని అధికారులు తెలిపారు.


