News December 3, 2025

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ADB కలెక్టర్, ఎస్పీ

image

ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మంగళవారం రాత్రి సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. వారితో పాటు అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఉన్నారు.

Similar News

News March 18, 2026

3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

image

TG: హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్‌తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.

News March 18, 2026

JNTUH-UAM ముక్కోణపు సహకారానికి LOI ప్రారంభం

image

జర్మనీకి చెందిన UAM ప్రతినిధి బృందం బుధవారం JNTUHను సందర్శించి ఉపకులపతి డాక్టర్ టి. కిషన్ కుమార్‌తో భేటీ అయ్యారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగాల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ ప్రోగ్రామ్‌ల కోసం JNTUH, UAM మరియు అనుబంధ కళాశాలల మధ్య ముక్కోణపు సహకారానికి (LOI) అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యావకాశాలు లభించనున్నాయి.

News March 18, 2026

డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లలో ఉండాల్సిందే.. లేదంటే రద్దే

image

రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు ఈనెల 31లోపు నివాసం ఉండాలని, లేనిపక్షంలో కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను ఏప్రిల్ మొదటి వారంలో కొత్తవారికి కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని RDO, MROలను కలెక్టర్ ఆదేశించారు.