News December 3, 2025

సీఎం పర్యటనను విజయవంతం చెయాలి: జేసీ

image

భామినిలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 5 తేదీ పర్యటనను విజయవంతం చెయ్యాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం భామినిలో మన్యం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎవరికి కేటాయించిన పనులు వారు పక్కగా నిర్వహించాలని కోరారు. ప్రధానంగా విద్యుత్, రహదారులు, ట్రాఫిక్, మెడికల్ సర్వీసులు అందుబాటులో ఉండాలని, ప్రోటోకాల్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.

Similar News

News March 14, 2026

కడప: 10th పబ్లిక్.. ఎగ్జామ్ సెంటర్ గుర్తించండిలా.!

image

కడప (D)లో ఈ నెల 16 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు లేకుండా హాల్ టికెట్‌లో QR కోడ్‌ను ముద్రించారు. దీనిని ఫోన్‌లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్ ఫొటోలు కనిపిస్తాయని కడప జిల్లా DEO షంషుద్దీన్ తెలిపారు. మరింత సమాచారం కోసం <<19371473>>ఇక్కడ క్లిక్ చేయండి.<<>>

News March 14, 2026

అన్నమయ్య: 10th పబ్లిక్.. ఎగ్జామ్ సెంటర్ గుర్తించండిలా.!

image

అన్నమయ్య (D)లో ఈ నెల 16 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త సౌకర్యాన్ని కల్పించింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు లేకుండా హాల్ టికెట్‌లో QR కోడ్‌ను ముద్రించారు. దీనిని ఫోన్‌లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, ఫొటోలు కనిపిస్తాయని జిల్లా అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. మరింత సమాచారం కోసం <<19371473>>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News March 14, 2026

మెదక్: 11న పెళ్లి చూపులు.. యువతి MISSING

image

మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సురేఖ(22) ఇస్నాపూర్‌లో అదృశ్యమైంది. తన బంధువు వికాస్ ఇంటికి వచ్చిన ఆమె, ఈ నెల 11న పెళ్లి చూపుల కోసం డ్రెస్ కొంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు సురేఖ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.