News December 3, 2025
పెనుకొండలో ఉచిత నైపుణ్యాభివృద్ధి కోర్సులు

పెనుకొండలోని శ్రీ పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌లో ఉచిత నైపుణ్యాభివృద్ధి కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సవిత తెలిపారు. ఈనెల 15న వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో స్కిల్ హబ్‌లో 3 ప్రధాన కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తిచేసినవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 22, 2026
పాడేరు: స్టీల్ ప్లాంట్‌పై విస్తృత ప్రచారం

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం పాడేరులో టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా గిరిజన యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె వివరించారు.
News March 22, 2026
వారంలో 10% తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గతవారంలో బంగారం ధర 10% తగ్గింది. 2011 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్ బలోపేతం కావడం వల్ల ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో శుక్రవారం బంగారం ఔన్సు ధర 4,492 డాలర్లకు చేరింది. వెండి కూడా వారం రోజుల్లో 15% దిగొచ్చింది. దేశీయంగా MCXలో 10 గ్రాముల బంగారం ధర ₹1,44,825కు పడిపోగా కిలో వెండి ₹2,27,470 వద్ద ముగిసింది.
News March 22, 2026
HYD: రేపటి నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు

అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి పడే 2% లైఫ్ ట్యాక్స్‌ను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నట్లు HYDలోని అధికారులు తెలిపారు. ఈ మేరకు వాహన్ పోర్టల్ అందుబాటులోకి రానుందని అన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారని దీని ద్వారా దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఒకే గొడుగు కిందికి రానున్నాయని వెల్లడించారు. 2% పన్ను ఎత్తివేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
# SHARE IT


