News April 18, 2024

వారికి మాత్రమే ఓటు వేసే ఛాన్స్

image

TS: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈనెల 30న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఆ జాబితానే పోలింగ్‌కు ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే అందులో ఓటు హక్కు ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఈ నెల 30న ఓటుహక్కు పొందుతారు. రాష్ట్రంలో 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నట్లు ఫిబ్రవరిలో ఈసీ ప్రకటించింది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News October 14, 2024

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం

image

APలో అల్పపీడన ప్రభావం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, తూ.గో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరుకు NDRF బృందం చేరుకుంది. తిరుపతిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం <<14350584>>ఏర్పడనుందని<<>> అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

News October 14, 2024

సిరి లెల్ల.. పల్నాడు అమ్మాయే

image

హీరో నారా రోహిత్‌తో హీరోయిన్ సిరి లెల్ల నిశ్చితార్థం జరిగింది. కాగా సిరి పూర్తి పేరు శిరీషా. ఈమెది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల. శిరీషాకు నలుగురు తోబుట్టువులు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మీ రెంటచింతలలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్. రెండో అమ్మాయి భవానీ పెళ్లి చేసుకుని USలో, మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని HYDలో స్థిరపడ్డారు. ప్రియాంక వద్ద ఉంటూ శిరీషా సినిమా ప్రయత్నాలు చేశారు.

News October 14, 2024

ఇజ్రాయెల్‌కు US అత్యాధునిక ఆయుధాల సాయం

image

ఇరాన్ హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్‌కు సాయం చేయడంలో అమెరికా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్‌కు అత్యాధునికమైన థాడ్(టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్)బ్యాటరీతో పాటు సైనిక దళాలను కూడా యూఎస్ పంపింది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను థాడ్ కూల్చేస్తుంది. మరోవైపు తమ ప్రజలు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది.