News December 3, 2025

వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

image

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News March 8, 2026

అబ్దుల్‌ అజీజ్‌ తల్లి మృతి.. MP నివాళి

image

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్‌ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్‌ అజీజ్‌ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

News March 7, 2026

అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

image

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.

News March 7, 2026

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: DMHO సుజాత

image

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. శనివారం వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాధాశ్రమంలో మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులకు తేడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనాధ బాలల మధ్య ఈ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.