News December 3, 2025
20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్‌లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్‌లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.
Similar News
News April 8, 2026
పాఠశాలలో కృష్ణా కలెక్టర్ తనిఖీలు

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాపులపాడు మండలం మడిచర్లలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో మమేకమై వారి చదువు అలవాట్లను తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేచి చదవాలన్నారు. పరీక్షల ముందు కాకుండా నిరంతరం అభ్యాసం చేయాలని సూచించారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం చదవాలని ప్రోత్సహించారు. వాలంటీర్లు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
News April 8, 2026
కృష్ణా: గడ్డి ధరల దూకుడు.. పాడి రంగం కుదేలు

కృష్ణా జిల్లాలో పశు గ్రాసం కొరతతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరం గడ్డి కొనుగోలుకు సుమారు రూ. 10,000 ఖర్చవుతుండగా, రవాణా, కూలీల ఖర్చులతో మరో రూ. 5,000 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. మొత్తం రూ. 15 వేల వరకు ఖర్చు చేసినా సరిపడా గడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో పశువుల పోషణ కష్టమై పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 7, 2026
కృష్ణా: పాలిటెక్నిక్ లెక్చరర్ల ఫలితాలు విడుదల

AP ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్) లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.


