News December 3, 2025

ఓడరేవుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు: MP మేడా

image

ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని MP మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్లో కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవుల అభివృద్ధి గురించి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ప్రశ్నలు అడిగారు. పోర్టు ఆర్ధిక కార్యకలాపాలలో ఎస్సీ, ఎస్టీ కులాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి అనుసరించిన తీరును అడిగారు. లింగ సమానత్వ ఉపాధి, సమాన అవకాశాల కల్పన కోసం తీసుకున్న చర్యలు వివరించాలన్నారు.

Similar News

News March 14, 2026

కోదాడలో 42 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

image

కోదాడ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 42 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ పరికరాలను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం పంచనామా నిర్వహించి సిలిండర్లను శ్లోక గ్యాస్ గోదాముకు తరలించారు.

News March 14, 2026

గిరి పుత్రులకు అండగా ఉంటాం: పవన్ కళ్యాణ్

image

తాను గిరిపుత్రులకు అండగా ఉంటానని, వారి రహదారి కష్టాలు చూడలేక.. వారు కోరకపోయినా రోడ్లు వేయించామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో మాటా మంతీ కార్యక్రమంలో ఆయనకు గిరిజనులు పలు సమస్యలు విన్నవించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు. 40 ఇళ్లకు రూ.2 కోట్లు ఖర్చు చేసి రోడ్డు వేశామన్నారు.

News March 14, 2026

కలెక్టరేట్: హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ప్రవేశాలు

image

హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రవేశాలు ప్రారంభమైనట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా 60 సీట్లు భర్తీ చేస్తారని, ఎంపికైన వారికి నెలకు రూ. 2,500 స్టైపెండ్ అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు klbiiht.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.