News December 3, 2025
హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్‌కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News March 14, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 14)

1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం (ఫొటోలో)
1883: తత్వవేత్త, రాజకీయ ఆర్థికవేత్త కారల్ మార్క్స్ మరణం
1917: సినీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ జననం
1931: భారత్‌లో తొలి టాకీ మూవీ ‘ఆలం ఆరా’ విడుదల
1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
2008: శంషాబాద్ విమానాశ్రయ ప్రారంభోత్సవం
2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
* అంతర్జాతీయ గణిత దినోత్సవం
News March 14, 2026
MBNR: టెన్త్ పరీక్షలు.. ఎస్పీ కీలక ఆదేశాలు

టెన్త్ పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పరీక్ష ప్రాంతాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు ఉపయోగించి ఉరేగింపులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు తెలిపారు.
News March 14, 2026
ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ విడుదలైనట్లు KU అధికారులు పేర్కొన్నారు. KU పరిధిలోని ఉమ్మడి. ఆదిలాబాద్ జిల్లాలో 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో పరీక్షలు ఉంటాయని తెలిపారు.


